జగద్గురుబోధలు
శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురువులు
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి
ఉపన్యాసములు
అనువాదకులు : ''విశాఖ''
పరిశోధకులు, శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి.
''ఈ సంపుటాలు ఆంధ్రసరస్వతికి అమూల్యాభరణాలని చెప్పాలి. నేటి నాస్తికులకు నిత్య పారాయణం చేయతగ్గ గ్రంథాలు.. తియ్యటి తేట తెలుగుభాష, మూడు క్లాసులు చదివిన వాళ్ళైనా ముచ్చటగా చదువుకోదగిన గ్రంథాలు. తెలిసికొనదగిన అంశాలు. జీవితపరమార్థాన్ని అర్థించే ప్రతీ గృహస్థు హస్తభూషం చేసికొనదగిన గ్రంథాలివి. వేదధర్మస్వరూపం యిందులో వజ్రకాంతులతో నయనపర్వం చేస్తుంది.
- ఆంధ్రప్రభ.
1, 2, 3, 4, 5, భాగాలు భా. 1కి రు. 25-00
6,వ భా. 1కి రు. 20-00. 7, 8. 9వ భాగం కి రు. 30-00
10 భా. రు. 40-00 లు. మొత్తం 10 భాగాలు రు. 285-00
ముందుగా రు. 260-00లు పంపిన పోష్టు ఖర్చులు మేము భరించి రు. 2/-లకు వి.పి పంపెదము. విడిగా పుస్తకం ఖరీదు పంపిన పోష్టు చార్జీకి వి.పి చేయబడును. కొలది ప్రతులు మాత్రమే కలవు.
''ఆదిశంకరులు అద్వైత స్థాపనాచార్యులు. వారు జగద్గురువులైనందున వారి ఉపదేశము లొక్క హిందువులకేకాక. సమస్త మానవానీకానికే ప్రయోజన కారులగుచున్నవి. వారు ఏ మతాన్నీ కాదనలేరు. ఏ తాత్విక దృష్టినీ త్రోసి వేయలేదు. అద్వైతమే పరమావధి అని తక్కిన మతము లన్నీ సోపానప్రక్రియలై అద్వైతంలో లయము చెందగలవని వారు బోధించారు. విభిన్న తాత్విక మార్గాలను సమన్వయించి ఆత్మానుసందానానికి అన్నీ సహాయకారులనియే వారు నిరూపించారు. అద్వైతం ఒక మతం కాదు; అదొక అనుభూతి. అన్ని మతాలలోనూ అద్వైతానుభూతిని పొందిన మహాత్ములున్నారు''.
- జగద్గురు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు.
|